హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ప్రజాప్రతినిధులు సమైక్యాంధ్ర విషయంలో తమతో కలిసి వచ్చారని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు గురువారం హైదరాబాదులో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడిన తర్వాత సమైక్యాంధ్రపై మరింత నమ్మకం కలిగిందన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు అంత ఈజీ కాదని ప్రణబ్ చెప్పారని అన్నారు.
తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలు చర్చలతోనే పరిష్కారం అవుతాయన్నారు. తాము సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు, ధర్నాలు చేస్తామని అన్నారు. అయితే ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము ఆందోళనలు చేస్తామని చెప్పారు.