జగన్‌పై సిబిఐ విచారణ జరగాల్సిందే: విహెచ్

V Hanumanth Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ అవినీతి వెలికి రావాలంటే విచారణ జరగాల్సిందేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడాన్ని ఆయన స్వాగతించారు. మడమ తిప్పనని చెప్పే జగన్‌ సుప్రీంకోర్టుకు వెళ్లడమే తప్పని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అవినీతిపరులకు కనువిప్పని అన్నారు. సిబిఐ విచారణలో జగన్ అక్రమాలు బయటపడుతాయని ఆయన అన్నారు. పరిశ్రమలు స్థాపించని భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన ఢిల్లీలో డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు నిర్ణయం అవినీతిపై అంకుశమని తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. అవినీతిపరులకు హెచ్చరికలాంటిదని ఆయన అన్నారు. జగన్ జైలు ఊచలు లెక్కిస్తారని ఆయన అన్నారు. అక్రమాలకు పాల్పడనప్పుడు సిబిఐ విచారణకు జగన్ ఎందుకు భయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. వైయస్ జగన్ జైలులో కొవ్వొత్తులు తయారు చేసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. జగన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తెలుగుదేశం నాయకుడు ఎర్రంనాయుడు స్వాగతించారు. జగన్ అవినీతికి పాల్పడ్డారని తాము మొదటి నుంచీ చెబుతున్నామని ఆయన అన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని బట్టే జగన్ తప్పు చేశాడని అర్థమవుతోందని ఆయన అన్నారు.

వైయస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన జగన్ డబ్బు ఉందని సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. జగన్ అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించారని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడే జగన్ దోషి అని తేలిపోయిందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+