వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆస్తులు రూ. 2.49 కోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సోమవారం తన చర, స్థిరాస్తులను ప్రకటించారు. వాటి విలువ రూ. 2.49 కోట్లు ఉంటుంది. ప్రధాని తరహాలో ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సమాచార కమిషన్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆమె తన ఆస్తులను ప్రకటించారు. నాలుగేళ్లుగా ఆమె రాష్ట్రపతి పదవిలో ఉన్నారు. తన ఆస్తుల వివరాలను ఆమె వెబ్‌సైట్‌లో ఉంచారు. స్థిరాస్తుల విలువ రూ. 83.83 లక్షలు ఉండగా, చరాస్తుల విలువ రూ. 1.66 కోట్లు ఉంది.

ప్రతిభా పాటిల్‌కు మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో రూ.39.60 లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. రూ. 9.82 లక్షల విలువ చేసే 3.82 హెక్టార్లలో ఫామ్ హౌస్ ఉంది. తన తండ్రి నుంచి వారసత్వంగా లభించిన జల్గావ్‌లో 3.57 హెక్టార్ల వ్యవసాయ భూమి, ధూలే జిల్లాలో 20 లక్షల విలువ చేసే మరో భూమి ఉన్నాయి. ఆమెకు 31 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలున్నాయి.

English summary
President Pratibha Patil on Monday made public her movable and immovable properties worth over Rs 2.49 crore after the Central Information Commission requested her to take a decision on the lines of the Prime Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X