ఆజాద్‌తో భేటీ, తేలని తెలంగాణ సంప్రదింపులు

తెలంగాణపై తగిన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తమకు ఉందని సమావేశానంతరం మంత్రి కె. జానారెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్టీ అధిష్టానమే తమను చర్చలకు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఎల్లుండి మరోసారి ఆజాద్‌తో సమావేశమవుతామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ప్రత్యామ్నాయం లేదని తాము ఆజాద్‌తో చెప్పినట్లు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై రాజీ లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications