వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జిలో ప్రధాని, చిదంబరం: మాట మార్చిన రాజా

By Srinivas
|
Google Oneindia TeluguNews

A Raja
న్యూఢిల్లీ: మాజీ టెలికాం మంత్రి రాజా ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి చిదంబరంపై మాట మార్చారు. కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన రాజా మాట మార్చారు. 2జి స్పెక్ట్రం కుంభకోణంలోకి ప్రధాని, చిదంబరాన్ని లాగేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మాజీ టెలికాం మంత్రి రాజా మంగళవారం అన్నారు. తాను మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పారు. 2జి కుంభకోణం కేసులో వారి పేర్లను తాను వ్యాఖ్యానించలేదని అన్నారు. మీడియా అనవసరంగా వివాదాలు సృష్టిస్తోందన్నారు. మీడియా తన వ్యాఖ్యలను నా వ్యాఖ్యలుగా ప్రచారం చేయలేదన్నారు. మీడియా అనవసర వివాదాలు సృష్టిస్తే బయటకు వెళ్లి పోవచ్చని అన్నారు.

కాగా సోమవారం కోర్టుకు హాజరైన రాజా ప్రధానమంత్రిని, కేంద్రమంత్రి చిదంబరాన్ని 2జి స్పెక్ట్రం కేసులోకి లాగేలా మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధాని ముందే 2జి కేటాయింపులు జరిగాయని చెప్పారు. తనపై చర్యలు తీసుకోవాల్సి వస్తే 1993 నుండి మంత్రులుగా చేసిన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 2జి స్పెక్ట్రం కేటాయింపులలో ఎన్డీయే హయాంలో ఉన్న నియమాన్నే కొనసాగించామని కొత్తగా తాము ఏమీ చేయలేదాని చెప్పారు. మొత్తానికి ఈ వివాదంలోకి బిజెపి, మంత్రులను, కేంద్ర ప్రభుత్వాన్ని లాగి, ఇప్పుడు తాను ప్రధానిని, చిదంబరాన్ని లాగలేదని చెప్పడం విశేషం.

English summary
Former Telecom Minister A Raja on Tuesday softened his stand and said that he did not seek to implicate Prime Minister Manmohan Singh. "I did not seek to implicate the Prime Minister and the then finance minister in 2G case," said Raja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X