మళ్లీ ఢిల్లీకి: కాంగ్రెసు టి - ఎంపీలకు ఆజాద్ పిలుపు

వారితో తెలంగాణ అంశంపై చర్చించి రాజీనామాలపై వారిని వెనక్కి తగ్గించే ప్రయత్నాలలో భాగంగానే అధిష్టానం పిలిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. మరికొందరు ఎంపీలు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక్కడి నుండి ఎవరూ వెళ్లని పరిస్థితి ఉంటే అక్కడే ఉన్న యాష్కీ, బలరాం నాయక్ ఆజాద్‌తో రాజీనామాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆజాద్ ఢిల్లీకి రమ్మని చెబితే రెండు రోజుల తర్వాత వచ్చి కలుస్తామని చెప్పామని, ఆజాద్ భేటీకి అంత ప్రాధాన్యత ఉండదని చెప్పారు.












Click it and Unblock the Notifications