హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ఐటీ సేవల సంస్థ మహీంద్రా సత్యం భాగస్వామ్యాన్ని ఏర్పరచుకొంది. ఉద్యోగుల్లో ఉత్పాదకతను పెంపొందించే చైల్డ్ సపోర్ట్ సిస్టమ్స్ సొల్యూషన్స్ అందించేందుకు ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకొంది. మైక్రోసాఫ్ట్ షేర్‌పాయింట్ 2010 ఆధారంగా ఈ పరిష్కారాలను అందిస్తారు. ఈ సొల్యూషన్స్‌ను సౌకర్యవంతంగా అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం దోహదపడుతుందని మహీంద్రా సత్యం స్ట్రాటజిక్ అకౌంట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ మల్హోత్రా పేర్కొన్నారు.
IT firm Mahindra Satyam partnered with technological giant Microsoft Corporation to offer modern tools and solutions for the Child Support Systems to improve the productivity of workers.