తెలంగాణకు కొలికి: మన్యసీమ రాష్ట్రానికి డిమాండ్

ఆదిలాబాద్ నుంచి విజయనగరం వరకు ఉన్న ఏజెన్సీని 'మన్యసీమ'గా ఏర్పాటు చేయాలని కోరుతూ మన్యసీమ ఆదివాసీ గిరిజన ప్రజాప్రతినిధుల ఫోరం తరఫున ఆదివాసీ గిరిజన ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ను కలిసేందుకు శుక్రవారం ఢిల్లీ వెళుతున్నారు. ఆయన్ను కలిసి మన్యసీమ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించనున్నారు. ఈ ఫోరానికి ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్యదొర చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బాలరాజు కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు.
ప్రతినిధి బృందంలో వీరితో పాటు ఎమ్మెల్యేలు రాజన్నదొర, సుగ్రీవులు, మిత్రసేన, ఆత్రం సక్కు, సత్యనారాయణరెడ్డి, సోమా, మాజీ ఎమ్మెల్యేలు కుంజా భిక్షం, తాటి వెంకటేశ్వర్లు తదితరులు ఉంటారు. ఢిల్లీలో కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్, ఎంపీ బలరాం నాయక్ కూడా వీరితోపాటు ఆజాద్‌ను కలవనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సీతక్క, నగేష్ కూడా వెళ్లాల్సి ఉన్నా.. చివరి క్షణంలో ఆగారు. మన్యసీమ ప్రతినిధి బృందం ఆగస్టు 1న రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలవనుంది. ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఆయనకు వివరించాల్సిన అంశాలపైన ఇక్కడి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఫోరం ప్రతినిధులు సమావేశమై కసరత్తు చేశారు.












Click it and Unblock the Notifications