వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి అక్రమ మైనింగ్‌పై నోటీసులు: మైసూరారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

mysura
హైదరాబాద్‌: వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో అవినీతి, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు మైసూరారెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. 2 జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం విషయంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్, హోంమంత్రి చిదంబరంపై 2జి కుంభకోణంలో తీహార్ జైలులో ఉన్న రాజా చేసిన వ్యాఖ్యలు, బళ్లారి, ఓబుళాపురం మైనింగ్‌లపై కర్ణాటక లోకాయుక్త నివేదిక, సుప్రీం కోర్టు తీర్పు, ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మైనింగ్‌పై ప్రత్యేక చర్చకు నోటీసు ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

కెజి బేసిన్‌ గ్యాస్‌ ధర నిర్ణయంపై కాగ్‌ రిపోర్ట్‌, అటు లాభదాయక ధర లేక ఇటు విత్తనాలు, ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్‌ కారణంగా నిరాశానిస్పృహలతో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించడం, ఆత్మహత్యలకు పాల్పడడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. లోక్‌పాల్‌ బిల్‌ పరిధిలోకి ప్రధానిని కూడా చేర్చాలని సభ్యుల ఎంపిక పారదర్శకంగా జరగాలని పట్టుబడతామన్నారు.

English summary
Telugudesam Party MP Mysura Reddy said yesterday that they will give notice on AP mining in next Parliament session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X