చిదంబరం చిచ్చు: తెలంగాణ నేతల మండిపాటు

కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటన మరో విధంగా ఉంది. 14ఎఫ్‌ను తొలగించిన తర్వాతనే హైదరాబాదు ఎస్సై నియామకాలు జరుగుతాయని ఆయన అన్నారు. 14ఎఫ్‌ను తొలగించాలని గతంలోనే తాము సిఫార్సు చేశామని, అయితే కేంద్ర ప్రభుత్వం వివరణ కోరిందని, దాన్ని కూడా ముఖ్యమంత్రి పంపించి ఉంటారని ఆయన అన్నారు.
చిదంబరాన్ని తాను మేధావి అనుకున్నానని, పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మళ్లీ తీర్మానం చేయాలంటే ప్రస్తుత అసెంబ్లీ రద్దు కావాలని ఆయన అన్నారు. రాజయ్య వంటి కాంగ్రెసు నాయకులు కూడా చిదంబరం ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు.
కాగా, ఈ నెల 5వ తేదీన జరిగే ఎస్సై రాతపరీక్షలను వాయిదా వేయకపోతే బంద్ పాటిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. పరీక్షను అడ్డుకుంటామని ఒయు జెఎసి హెచ్చరించింది. దీనిపై తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతున్న సమయంలో చిదంబరం పుండు మీద కారం చల్లినట్లు ప్రకటన చేశారని అంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాదు ఫ్రీజోన్‌గా ఉంది. 14ఎఫ్ నిబంధనను తొలగిస్తే అది ఆరో జోన్ కిందికి వస్తుంది. తెలంగాణ వాదులు హైదరాబాదును ఆరో జోన్ కిందినే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాదును ఫ్రీజోన్ చేస్తే స్థానికులు నష్టపోతారనేది తెలంగాణవాదుల మాట.












Click it and Unblock the Notifications