జగన్ కోసం కెసిఆర్ రైల్‌రోకో రద్దు చేశారు: ఎర్రబెల్లి

అదే గత నెలలో జగన్ ప్లీనరీకి అడ్డుగా ఉండకూడదని రైలురోకోను రద్దు చేసుకున్నారని అన్నారు. కెసిఆర్, జగన్ కుమ్మక్కుకు ఇదే మంచి నిదర్శనం అని చెప్పారు. తెలంగాణ వాదులు వారి ఉద్దేశ్యాలను అర్థం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ బిల్లును శీతాకాలపు పార్లమెంటు సమావేశాలలో పెట్టాలని డిమాండ్ చేశారు. 14ఎఫ్ ఎత్తి వేసే వరకు ఎస్సై పరీక్షలను నిర్వహించరాదని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఒకరిద్దరు రాజీనామాలు చేస్తే తెలంగాణ రాదని ఉప ఎన్నికలు వస్తాయని చెప్పారు. రాజ్యాంగ సంక్షోభం ద్వారానే తెలంగాణ వస్తుందన్నారు. ఈ దీక్షలో 19 శాసనసభ్యులు, నలుగురు శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులకు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications