హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ మైనింగ్, కృష్ణపట్నం ఓడరేవుపై నీలినీడలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishnapatnam Port
హైదరాబాద్: ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు కర్ణాటక అక్రమ ఇనుప ఖనిజం ఎగుమతి బండారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గల కృష్ణపట్నం ఓడరేపుపై పడింది. కర్ణాటకకు చెందిన అక్రమ ఇనుప ఖనిజం ఎగుమతి ఎక్కువగా కృష్ణపట్నం ఓడరేవు నుంచి జరిగినట్లు కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే తప్పు పట్టారు. మైనింగ్ రాకెట్‌కు సంబంధించి ఈ కోణంలో మరింత దర్యాప్తు జరగాలని ఆయన సూచించారు. కర్ణాటకలోని ఇనుప ఖనిజం ఎగుమతికి ఏ సంస్థకు కూడా అనుమతులు లేవు. ఈ స్థితిలో గత రెండేళ్లుగా ఎక్కువగా కృష్ణపట్నం నుంచి ఎగుమతి అయినట్లు లోకాయుక్త అభిప్రాయపడింది.

ఇనుప ఖనిజం అక్రమ రవాణా విషయంలో లోకాయుక్త ప్రత్యక్షంగా కృష్ణపట్నం ఓడరేపును తప్పు పట్టింది. ఈ ఓడరేవును హైదరాబాదుకు చెందిన సివిఆర్ గ్రూపు ప్రమోట్ చేసింది. సివిఆర్ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. ఓడరేవు ఇపిసి కాంట్రాక్టర్ దానికే ఉంది. ఈ స్థితిలో నవయుగ సంస్థపై సిబిఐ దృష్టి సారించినట్లు సమాచారం. కంపెనీ స్ట్రక్చర్, యాజమాన్యం స్థితిగతులైప ప్రభుత్వం వాన్‌పిక్‌ నుంచి నివేదిక కోరినట్లు తెలుస్తోంది.

English summary
In a clear indictment of the functioning of the private ports in Andhra Pradesh, the Santosh Hegde Lokayukta report on illegal iron ore mining in Karnataka has stated that the maximum export of illegal iron ore took place from the privately-owned Krishnapatnam port in Nellore district in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X