ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్ జగన్ ఓటు

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం లోకసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశారు. అధిక ధరలపై జరిగిన వోటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. లోకసభ సభ్యుడిగా ఆయన గురువారంనాడే ప్రమాణం చేశారు. అధిక ధరలపై జరిగిన చర్చ అనంతరం దానిపై వోటింగ్ జరగాలని వామపక్షాలు పట్టుబట్టాయి. బిజెపి మాత్రం ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పింది. ఓటింగు జరగాలని వామపక్షాలు పట్టుబట్టాయి. దీంతో వోటింగు జరిగింది.

లోక్‌పాల్ బిల్లుపై వామపక్షాల సభ్యులతో పాటు బయటకు వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసిన వైయస్ జగన్ వామపక్షాలతో కలిసి నడుస్తారా అనే సందేహం కలిగింది. దానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఏ పార్టీకీ మద్దతు తెలపడం లేదని, అధిక ధరలకు కేంద్ర ప్రభుత్వం జవాబుదారీ వహించాలని, అందుకే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశానని చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+