కిరణ్ క్యాబినెట్ మీట్ ప్లాన్, టి - మంత్రులకు గాలం

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో మంత్రి వర్గ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పథకం వేశారు. ఈ నెల 16వ తేదీన ఆయన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులను రప్పించేందుకు తగిన వ్యూహాన్ని ఆయన రచించారు. సమావేశాన్ని సచివాలయంలో కాకుండా తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు. సచివాలయంలో సమావేశానికి తాము రాబోమని తెలంగాణ మంత్రులు చెప్పడంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేస్తే మంత్రివర్గ సమావేశానికి వస్తామని తెలంగాణ మంత్రులు చెప్పినట్లు సమాచారం. మంత్రివర్గం ఆమోదం లేకుండానే తాను కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాలను బహిష్కరించే విషయంలో కూడా కొంత మంది తెలంగాణ మంత్రులు డైలమాలో పడినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+