మాజీ సిఎం రోశయ్యకు గవర్నర్ పదవి ఉట్టిదే?

ఇప్పుడు రోశయ్యకు గవర్నర్ పదవి కట్టబెట్టే ఆలోచన కూడా పార్టీ అధిష్టానం మదిలో లేనట్లు చెబుతున్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడమే అత్యంత ప్రాధాన్యమైన విషయంగా చూస్తోంది. తెలంగాణ సమస్యపై ఇరు ప్రాంతాల పార్టీ నాయకులను దారిలోకి తెచ్చుకునే మార్గాల కోసం పార్టీ అధిష్టానం అన్వేషిస్తోంది. తాజాగా, రోశయ్య తెలంగాణ వివాదంలో చిక్కుకున్నారు. ఇది రోశయ్యకు వ్యతిరేకంగా పని చేయవచ్చునని అంటున్నారు. ఈ స్థితిలో రోశయ్యకు గవర్నర్ పదవి ఇస్తే తెలంగాణ విషయంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని కూడా భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications