హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పు చేసినందుకే జగన్ పార్టీ విడిచాడేమో?: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణలో ఏం తేలుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం గాంధీ భవనంలో మీడియా సమావేశంలో అన్నారు. అప్పటి నిర్ణయాలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గం బాధ్యత వహించాల్సిందేనని బొత్స అన్నారు. అయితే నిర్ణయాలకు మాత్రమే మంత్రివర్గం బాధ్యత ఉంటుంది. తెరవెనుక జరిగే వాటికి మంత్రివర్గం బాధ్యత ఉంటుందన్నారు.

తెరవెనుక ఎవరైనా పాలుపంచుకుంటే వారూ బాధ్యత వహించాలని అన్నారు. అయినా విచారణలో వాస్తవాలు తెలుస్తాయని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు అయిందన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వ్యోక్స్ వ్యాగన్, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో సిబిఐ దర్యాఫ్తు జరిగిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. తాను పరిశ్రమల శాఖలో కొంతకాలం మాత్రమే మంత్రిగా పని చేశానని చెప్పారు. నా హయాంలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఎపిఐఐసి తుంగలో తొక్కిందని విమర్శించారు. దివంగత వైయస్ ఎప్పుడూ మా నాయకుడే అన్నారు.

వైయస్ ప్రతిష్ట దెబ్బతీస్తున్నది తాము కాదని జగన్ పార్టీయే అన్నారు. జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లకుండా సిబిఐ విచారణకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. తాను చేసిన తప్పులకు జగన్ కాంగ్రెసును నిందించ వద్దని సూచించారు. జగన్ తప్పు చేసినందువల్లే పార్టీని విడిచి వెళ్లాడని ఎందుకు అనుకోకూడదని బొత్స ప్రశ్నించారు. కాగా పార్టీకి అండగా ఉండాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కార్యకర్తలను కోరారు. అంతకుముందు ఆయన ప్రజారాజ్యం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. విలీనంపై చర్చించారు.

English summary
PCC chief Botsa Satyanarayana suspected today in media conference that YSR Congress party president YS Jaganmohan Reddy may left party for his corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X