జగన్‌పై విచారణ, సోనియా గాంధీపై అంబటి నిప్పులు

Ambati Rambabu
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై నిప్పులు చెరిగారు. జగన్‌ను వెనకేసుకుని రావడానికి ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సోనియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో సోనియా, సోనియా చెల్లెలి పాత్ర ఉందని జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి 206 పేజీల లేఖ రాశారని, జగన్‌ విచారణకు సిద్ధపడాలని అంటున్నవారు సోనియా ప్రాసిక్యూషన్‌కు సిద్ధం కావాలని ఎందుకు అడగడం లేదని ఆయన అన్నారు. జగన్‌ను, తమ పార్టీని దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే జగన్‌ను కోర్టు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆయన విమర్శించారు.

తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, జగన్ నిర్దోషిగా బయటపడతారని, తమకు ఏ విధమైన నష్టం కూడా జరగదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అభూత కల్పనలతో జగన్‌పై దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్‌ను, తమను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నార. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+