మంత్రులపై వేడుకల్లో గుడ్లు విసిరిన తెలంగాణవాదులు

కరీంనగర్ జిల్లాలోనూ జిల్లా మంత్రి శ్రీధర్ బాబును తెలంగాణవాదులు అడ్డుకున్నారు. జై తెలంగాణ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వరంగల్ జిల్లాలో పట్టణంలోని అశోకా హోటల్‌లో ఫలహారం చేస్తుండగా పోలీసులు కాకతీయ విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ సమితి విద్యార్థులను నిర్బంధించారు. నల్గొండ తదితర జిల్లాల్లో పలువురు తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాగా నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి దామోదర రెడ్డి జాతీయ జెండా, తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణపై తీవ్ర విమర్శలు చేస్తున్న మంత్రి టిజి వెంకటేష్‌ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications