హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంపై చైనా నెటిజన్లలో ఆసక్తి

ఇన్ని ప్రతిబంధకాల మధ్య చైనా వార్తా వెబ్ సైట్ ల ద్వారా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంపై కొన్ని చర్చలు జరుగుతున్నాయి. చైనాలో మైక్రో బ్లాగర్లు హజారే ఉద్యమాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించి వేలమందిని వీధుల్లోకి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హజారే ఉద్యమాన్ని చైనా పరిస్ధుతులతో బేరీజు వేసుకున్నారు. చైనాలో అవినీతి పెచ్చరిల్లి ప్రజాగ్రహం విస్తృతంగా ఉన్నప్పటికీ నిరసన తెలిపే హక్కులపై ప్రభుత్వం పరిమితి విధిస్తుంది.
“కైజింగ్" అనే లిబరల్ పత్రిక హజారేను “నూతన గాంధీ"గా అభివర్ణించింది. ఆంగ్లంలో ట్విట్టర్ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ వలెనే చైనాలో “సినా వీబో" అనే వెబ్ సైట్ ఉంది. అందులో “కైజింగ్" పత్రిక తన కామెంట్ పోస్ట్ చేసింది. “కైజింగ్" ను 14 కోట్లమంది వినియోగిస్తున్నారని అంచనా. “ఇండియా కంటే చైనాలో ఎక్కువ అవినీతి ఉంది. కాని మనం నిరసనల్ని ఎప్పుడు పొందగలం?" అని ఒక మైక్రోబ్లాగర్ రాసుకున్నట్లుగా 'ది హిందూ" తెలిపింది. మరొక వ్యక్తి “చైనాలో కూడా ఓ గాంధీ పుట్టాలి" అని రాసుకున్నాడు.
చైనాలో అవినీతిపై ప్రజలలో ఆగ్రహం బాగా వ్యాపించి ఉంది. ఇటీవల చైనాలో జరిగిన హై-స్పీడ్ రైలు ప్రమాదం అవినీతిని ఎత్తి చూపింది. ఈ ప్రమాదం అనంతరం రైల్వే మంత్రి లియు ఝిజూన్ రాజీనామా చేయవలసి వచ్చింది. ప్రమాదం గురించిన వివరాలు బైటికి పొక్కకుండా చైనా జాగ్రత్తలు తీసుకుందని పశ్చిమ దేశాల పత్రికలు ఘోషించాయి. ఒక అధికారి $2.8 బిలియన్లను విదేశాలకు తరలించాడని వెల్లడి కావడంతో అక్కడ అవినీతిపై చర్చ జరుగుతోంది. మధ్య తరగతి ప్రజానీకంలో అవినీతిపై ఆగ్రహం పెల్లుబుకుతోంది.
స్ధానిక పభుత్వాలు, కింది స్ధాయి అధికారులు అవినీతికి పాల్పడినప్పుడు చైనా వార్తా పత్రికలు పెద్ద ఎత్తున వార్తలను రాసినా, ఉన్నత స్దాయిల్లోని అవినీతిపై నిశ్శబ్దం పాటిస్తాయి. వాటికా అనుమతి లేకపోవడమే అందుకు కారణం. ఇండియాలో ఉన్న పరిమిత నిరసన హక్కును కూడా చైనీయులు ప్రశంసిస్తుండగా, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పత్రికలు మాత్రం నిరసనలవలన తలెత్తే రాజకీయ అస్ధిరత పై దృష్టిని కేంద్రీకరించాయి. హజారే ఉద్యమం వెనుక అమెరికా హస్తముందన్న కాంగ్రెస్ ఆరోపణలను కూడా తమకు అనుకూలంగా వినియోగించాయి.
-
కొత్త ఫోన్ లాంఛ్ చేసిన "Honor".. కిర్రాక్ ఫీచర్స్ ! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications