రామోజీకి నిలువెల్లా విషమంటా సాక్షి డైలీ అటాక్

సాక్షి"లోనే కాదు, జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులన్నీ పారదర్శకం. ఇందులో రహస్యమేమీ లేదు. ఎవరు ఎంత పెట్టుబడి పెట్టారో... ఎవరికెంత వాటా ఉందో జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. కాంగ్రెస్‌ను వదిలిపెట్టినందుకు రాజకీయంగా తనపై జరుగుతున్న కుట్రను ఛేదించుకుంటూనే వస్తున్నారు. కానీ... ఎల్లోమీడియా పెద్దన్న 'ఈనాడు"ది మాత్రం అదే శైలి. సీబీఐ సోదాల్ని అడ్డంపెట్టుకుని శుక్రవారం తన పత్రికలో ఒక పేజీ నిండా విషం కక్కింది. 'అవినీతికి సాక్షీ భూతం" అంటూ చేతికొచ్చిన రాతలు రాసి పడేసింది. పదేపదే వివరణలిచ్చినా తాననుకున్నదే రాస్తూ... నిలువెల్లా రగిలిపోతున్న ఈ రామోజీరావుది అసలు ఏ నీతి? ఈయన చరిత్రేంటి?
పోటీ వస్తుందనే భయంతో ఒక పత్రికను చంపారు. తన డిపాజిట్ల కోసం తప్పుడు రాతలు రాసి సహకార బ్యాంకుల్ని ముంచేశారు. ఉద్యోగుల్నే బినామీలుగా పెట్టుకుని సువిశాల ఫిల్మ్‌సిటీ నిర్మించుకున్నారు. భూదాహం తీరక ప్రభుత్వ భూముల్నీ ఆక్రమించారు. ఏటా నష్టాలు చూపిస్తూ కోట్ల రూపాయల పన్నులు ఎగ్గొట్టారు. అదే సమయంలో లక్షల కోట్ల ఆస్తులు మూటకట్టుకున్నారు. రాజకీయ కవల చంద్రబాబుతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు.
నమ్మిన బంధువుల్ని నట్టేట ముంచారు. లీజుకిచ్చిన పాపానికి భూ యజమానిని ముప్పతిప్పలు పెడుతున్నారు. ఆఖరికి సొంత కొడుకు కూడా ఈయన్ను ''ఆయనకెవ్వరూ అక్కర్లేదు. డబ్బుంటే చాలు. ఒట్టి డబ్బు మనిషి"" అని తిట్టారంటే... విశాఖలో '420" కేసు కూడా నమోదయిందంటే... ఈయనెంత నిఖార్సో, ఈయన రాసే రాతలకు ఎంత విలువుందో... అవెంతవరకూ నమ్మొచ్చో జనానికి తెలియనిదేమీ కాదు.












Click it and Unblock the Notifications