వెబ్ విహారిణిలో చెలరేగాలంటే బ్రౌజర్ టిప్స్ తెలుసుకొవాల్సిందే..

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ టిప్స్:
1. వెబ్ పేజీల నుంచి కావాల్సిన టెక్ట్స్‌ని కాపీ చేసి ప్రింట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే హెచ్‌టీఎంఎల్ కోడ్ కూడా వచ్చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఫాంట్ సైజు, బోల్డ్, ఇతర ఫార్మెట్‌లో సంబంధం లేకుండా కేవలం టెక్ట్స్‌ని తీసుకోవాలంటే Copy Plain Text సదుపాయాన్ని బ్రౌజర్‌లో నిక్షిప్తం చేసుకోండి.
2.డౌన్‌లోడ్స్ వివరాల్ని చూసేందుకు 'టూల్స్' మెనూలోని 'డౌన్‌లోడ్స్' ఆప్షన్‌తో పని లేకుండా బ్రౌజర్ కింది భాగంలోనే స్టేటస్‌బార్‌లా పొందాలంటే Download Statusbar ఉంది.
3.సాఫ్ట్‌వేర్‌లనుగానీ, విండోలనుగానీ మినిమైజ్ చేస్తే టాస్క్‌బార్‌పైనే కూర్చోవడం తెలసిందే. అలా కాకుండా వాటిని సిస్టం ట్రేలో మినిమైజ్ అయ్యేలా చేయడం తెలుసా? 'మినిమైజ్ టూ ట్రే'తో సాధ్యమే.
4.ముఖ్యమైన వెబ్ లింక్‌లను ప్రత్యేక ఫోల్డర్‌లో భద్రం చేసుకోవాలంటే 'సేవ్ లింక్ ఇన్ ఫోల్డర్'ను ఉంటే సరి. లింక్‌ను సెలెక్ట్ చేసి రైట్‌క్లిక్ చేస్తే Save Link in Folder వస్తుంది.
5.ప్రమాదకరమైన సైట్‌ల్లోని స్క్రిప్ట్ ఫైల్స్ ఆటోమాటిక్ రన్ కాకుండా సెక్యూరీటీ పెట్టుకోవాలంటే NoScript ఉంది.
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్ టిప్స్:
1.మౌస్ క్లిక్‌తోనే పనుల్ని చక్కబెట్టేందుకు Mouse Gestures ఉంది. క్లిక్‌తోనే విండోలను క్లోజ్, ఓపెన్ చేయవచ్చు. Back a page, Switch between tabs లాంటి మరిన్ని పనుల్ని చేయవచ్చు.
2.సైట్‌ల్లోని పాప్‌అప్ యాడ్స్‌ని బ్లాక్ చేయడానికి Simple adblock పొందండి.
3.ఏదైనా పదంపై మరింత సమాచారాన్ని అక్కడే అందించేదే Apture Highlights. నిక్షిప్తం చేసిన తర్వాత పదాన్ని సెలెక్ట్ చేస్తే చాలు బాక్స్‌లో పదానికి సంబంధించిన నిర్వచనం, ఫొటోలు, ఇతర సమాచారం కనిపిస్తుంది.
4. మెయిల్, బ్లాగులు, ఫొరమ్స్‌లో టైప్ చేసిన టెక్ట్స్‌లోని అక్షర దోషాల్ని సరి చేసుకోవాలంటే ieSpellతో చాలా సులభం.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications