సుష్మాకు జగన్ అవినీతి కనిపించడం లేదా: దేవేందర్

Devender Goud
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ సమర్థించడాన్ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుడు టి. దేవేందర్ గౌడ్ తప్పు పట్టారు. దేశమంతా అవినీతి వ్యతిరేక పోరాటం జరుగుతుంటే సుష్మాకు జగన్ అవినీతి కనిపించడం లేదా అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. ఇక పార్లమెంటులో జగన్‌కు అనుకూలంగా సుష్మాస్వరాజ్‌ ఎందుకు మాట్లాడుతున్నారో ఆమే సమాధానం చెప్పాలన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి తనను బ్లాక్ మొయిల్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. దానివల్లనే తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ఆయన వ్యతిరేకించారు. వైయస్ రాజశేఖర రెడ్డి తనను చాలా ఇబ్బందులకు గురిచేశారని ఆయన అన్నారు. చిదంబరానికి కేంద్ర హోంమంత్రిగా ఉండే అర్హత లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల దృష్టిలో చిదంబరం విలన్‌గా మిగిలిపోతారని ఆయన అన్నారు. తెలంగాణపై చిదంబరం పూటకో మాట మాట్లాడుతూ ప్రజలతో రాజకీయం చేస్తున్నారన్నారు.

తండ్రికి చెడ్డపేరు తెచ్చే విధంగా వైఎస్‌ జగన్‌ అవకాశం కల్పిస్తున్నారని కరీంనగర్‌ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. రాజశేఖర్‌రెడ్డికి, జగన్‌కు ఆలోచన విధానంలో చాలా వ్యత్యాసం ఉందని ఆయన శనివారం కరీంనగర్‌లో చెప్పారు. తన తండ్రి పేరును జగన్‌ అప్రతిష్టపాలు చేస్తున్నారని పొన్నం ఆరోపించారు. దుష్ప్రచారంతో ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని జగన్‌ ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతినిచ్చినట్లు అవుతుందని తెలిపారు. వారు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+