వైయస్ జగన్ భవిష్యత్తు వ్యూహం: ఎమ్మెల్యేలతో భేటీ

ఈడి నోటీసులు జారీ చేసినా, తాను ప్రజా క్షేత్రంలో ఉండని పరిస్థితులు ఎదురైనా ఏం చేయాలనే విషయంపై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశనం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసి సిబిఐ కేసు దృష్టిని మరల్చడంలో ఎమ్మెల్యేలు విజయవంతమయ్యారని జగన్ వర్గం భావిస్తున్నట్లుగా సమాచారం. కాగా ఎమ్మార్ కేసులో పలువురికి సిబిఐ నోటీసులు పంపినట్లుగా సమాచారం.
కాగా అంతకుముందు కృష్ణా జిల్లాలో మొదటి విడుత ఓదార్పు యాత్ర ముగించుకొని జగన్ నేరుగా హైదరాబాద్ వచ్చారు. సెప్టెంబర్ 2న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications