కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై రోశయ్య హయాంలో కుట్ర: వివేక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vivek
కరీంనగర్: తమిళనాడు గవర్నర్‌గా నియమితుడైన కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణపై కుట్ర జరిగిందని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు వివేక్ బుధవారం ఆరోపించారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఎన్ని పదవులు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ తెలంగాణను మాత్రం అడ్డుకోవద్దని కోరారు. సెప్టెంబర్ నెలాఖరులోపు తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ విషయంలో రోశయ్య ద్వంద్వ వైఖరి అవలంబించారని ఆయన విమర్శించారు. పార్టీ అధిష్టానం తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయించాలని రోశయ్యకు చెప్పినప్పటికీ ఆయన అధిష్టానం ఆదేశాలు అమలు చేయలేదన్నారు. రామగుండం ఎఫ్‌సిఐ పునరుద్ధరణకు కరీంనగర్ జిల్లాకే ఒక వరం అన్నారు. కాగా రోశయ్యపై ఇటీవల తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు విరుచుకు పడుతున్నారు. సకల జనుల సమ్మెకు తమ మద్దతు ఉంటుందన్నారు. రెండు రోజుల క్రితమే మాజీ మంత్రి జీవన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు రోశయ్యపై విరుచుకుపడ్డారు.

English summary
Karimnagar MP Vivek blamed former chief minister Konijeti Rosaiah for Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X