హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో ఇద్దరు వైయస్ జగన్ ఎమ్మెల్యేలకు నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: రాజీనామాలపై అభిప్రాయం తెలుసుకునేందుకు మరో ఇద్దరు వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ మంగళవారం నోటీసులు పంపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, తెలుగుదేశం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిలను శనివారం తన ముందు హాజరుకావాలని నోటీసులు జారీచేశారు. ఇటీవల రాజీనామాలు చేసిన 26 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే తెదేపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అభిప్రాయాన్ని స్పీకర్‌ తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు మూడో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు హాజరుకావాలని శ్రీకాంత్‌రెడ్డి, బాలనాగిరెడ్డిలకు నోటీసులిచ్చారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకునే ముందు శాసనసభ్యుల అభిప్రాయాల్ని స్వయంగా తెలుసుకునే సంప్రదాయంలో భాగంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. దివంగత వైఎస్‌ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించడాన్ని తప్పుపడుతూ 23 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేలు, ప్రరాపా నుంచి ఎన్నికైన ఒకరు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఈ 26 మందిలో ప్రసన్నకుమార్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, శోభానాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథరెడ్డిలు అనర్హత పిటిషన్‌ను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే కొండా సురేఖ అనర్హత ఫిర్యాదును ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆమె రాజీనామా చేయలేదు. గతంలో కొండా సురేఖ చేసిన రాజీనామాను స్పీకర్‌ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో 26 రాజీనామాల్లో మొదటి విడతగా ఆరుగురి రాజీనామాలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఆరుగురిని స్పీకర్‌ పిలిచి స్వయంగా అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నారని సమాచారం. శ్రీకాంత్‌ రెడ్డి, బాలనాగి రెడ్డిల తర్వాత... శోభా నాగిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అమర్‌నాథ రెడ్డిల అభిప్రాయాలు తెలుసుకుని వారి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటారు.

ఆ తర్వాతే మిగతా 20 మంది రాజీనామాలపై స్పీకర్‌ దృష్టిసారించే అవకాశం ఉంది. హక్కుల నోటీసు తేలాకే నాగం రాజీనామాలపై దృష్టి తెదేపా ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌ రెడ్డి, హరీశ్వర్‌ రెడ్డి, జోగు రామన్నల రాజీనామాలపై నిర్ణయం ఇప్పుడే వెలువడే అవకాశం లేదని తెలుస్తోంది. అనర్హత పిటిషన్‌, సభా హక్కుల ఉల్లంఘన వంటివి విచారణలో ఉన్నపుడు ఆ సభ్యులు రాజీనామాలు చేసినా.. వాటిపై స్పీకర్‌ ఆచితూచి వ్యవహరిస్తారు. ఇటీవల స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నాగం జనార్దన రెడ్డికి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. దీనికి నాగం సమాధానం ఇచ్చారు. ఈ వివరణతో స్పీకర్‌ సంతృప్తి చెందాకే నాగం బృందం రాజీనామాలపై దృష్టిసారిస్తారు.

English summary
Speaker Nadendla Manohar sent notice to another two YS Jaganmohan Reddy mlas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X