హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తులపై యనమల కామెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: రాష్ట్ర అప్పులు ఎంత వేగంగా పెరిగాయో వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అంత వేగంగా పెరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం కామెంట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి రాష్ట్రానికి అప్పులు, ప్రజలకు పన్నులు, జగన్‌కు ఆస్తులు మిగిలాయని విమర్శించారు.

2జి కుంభకోణంలో వలె రెవెన్యూ రికవరీ యాక్టు కింద జగన్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో భారీగా పన్నులు పెరిగాయన్నారు. జగన్ కేసులో వైయస్ కుట్రదారుడని సిబిఐ పేర్కన్నదని యనమల అన్నారు. జగన్ ఆస్తులపై విచారణ జరుగుతుంటే కాంగ్రెసు నేతలు కెవిపి రామచంద్రారావు రూపొందించిన పుస్తకావిష్కరణకు వెళ్లడం హాస్యాస్పదం అన్నారు.

English summary
TDP senior leader Yanamala Ramakrishnudu commented on YSRC party president YS Jaganmohan Reddy property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X