రాజమండ్రి: అమెరికాలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న మన రాష్ట్రానికి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఉల్లితోటకు చెందిన శివకిరణ్ గత కొన్నాళ్లుగా అమెరికాలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఆయన తన భార్యతో కలిసి గ్రాండ్ డికెట్‌లో విహారయాత్రకు వెళ్లారు. అక్కడ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
శివకిరణ్ వయస్సు 35 ఏళ్లు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. అతని తండ్రి రాజమండ్రిలో వ్యాపారం చేస్తుంటాడు. సోదరుడు డెంటల్ వైద్యుడు. శివకిరణ్ మృతితో రాజమండ్రిలోని ఆయన ఇంటి వద్ద విషాదఛాయలు నెలకొన్నాయి.