వైయస్ జగన్ బంధువు ఇంట్లోనూ సిబిఐ సోదాలు

ఆస్తులకు సంబంధించి కొనుగోళ్ళు, బ్యాంకు ఖాతాలపై ఆరా తీశారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. నోబుల్‌కు జగన్‌తో ఉన్న సంబంధం ఏంటి? జగన్ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయా? ఆ డబ్బులు ఏ బ్యాంక్‌లో దాస్తున్నారు? ఎందుకోసం ఖర్చు పెడుతున్నారు? హైదరాబాద్ వెళితే ఎక్కడుంటారు? తదితర వివరాల కోసం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. నోబుల్‌కు సంబంధించిన లాప్‌టాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన సీబీఐ అధికారులు ఆయన కారును కూడా తనిఖీ చేశారు. స్థిరాస్తులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్ల కాపీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జగన్ యువసేన అధ్యక్షుడిగా పనిచేస్తున్న నోబుల్ గతంలో జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ 20 రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. స్థానిక మలకాపట్నంలోని నోబుల్ కాలనీలో నివాసం ఉండే ఈయనకు కైకలూరులో చేపల చెరువులు ఉన్నట్లుగా సమాచారం. ఈయన తండ్రి జాన్ స్థానిక నోబుల్ కళాశాలలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. నోబుల్ సతీమణి ఎస్తేరు వైఎస్ కుటుంబానికి సమీప బంధువు. వైఎస్ రాజారెడ్డి మేన కోడలు కూతురును నోబుల్ వివాహమాడారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబంతో నోబుల్ కుటుంబానికి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. నోబుల్ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్‌లో చురుకుగా తిరుగుతున్నారు. నోబుల్‌కు బెంగుళూరులో ఉన్న ప్లాట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు, మచిలీపట్నంలోని రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన పవర్ ఆఫ్ అటార్ని డాక్యుమెంట్ల ప్రతులను సీబీఐ అధికారులు తీసుకెళ్లినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications