మీసాలు లేకుండా కొత్త గెటప్‌లో కనుమూరి

Kanumuri Bapiraju
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి బాపిరాజు శనివారం నుండి కొత్తగా కనిపిస్తున్నారు. బుర్రమీసాలతో గంభీరంగా కనిపించే కనుమూరి శనివారం ఉదయం శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. దీంతో ఆయన తన మీసాలు కూడా తీసేయించుకున్నారు. దీంతో ఆయనను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. టిటిడి అధికారులు, కుటుంబ సభ్యులే కాదు ఆయనకు ఆయనే కొత్తగా కనిపిస్తున్నారట. మీసాలు లేని తన ముఖాన్ని అద్దంలో చూసుకుని తనను తానే నమ్మలేకపోయారట. మీసాలరాజుగా పేరొందిన ఆయన ఎంతో మురిపెంగా ఎన్నో ఏళ్లుగా మీసాన్ని పెంచుకుంటున్నారు.

జీవితంలో ఆయన మీసాలు తీయడం ఇది రెండోసారి. గతంలో రాజశేఖర్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీసం తీశారట. శుక్రవారం రాత్రి పదవీ ప్రమాణం చేశాక ఆలయం నుంచి వెలుపలికి వస్తుండగా ఆయన మీసాలు చూసి గుర్తుపట్టిన చాలామంది భక్తులు అభినందించారు. కానీ, శనివారం వేకువజామున తలనీలాలు సమర్పించుకుని, మీసాలను తీసేసి స్నానం చేసి గదిలోకి వచ్చిన ఆయన్ను కుటుంబ సభ్యులే గుర్తించలేకపోయారట. మధ్యాహ్నం పాలకమండలి సమావేశం అనంతరం ప్రెస్‌మీట్‌లో ఆయన్ను గుర్తుపట్టలేకపోతున్నామని మీడియా ప్రతినిధులు పేర్కొనగా.. మీరు కాదు... నన్ను నేనే గుర్తుపట్టలేక పోయానని ఆయన చమత్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+