కొండా సురేఖ, జయసుధ అందుకే హాజరు కాలేదు?

Konda Surekha and Jayasudha
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాటి భేటీకి ఆయన వర్గానికి చెందిన 29 మంది శాసనసభ్యులలో కేవలం 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఏడుగురు శాసనసభ్యులు హాజరు కాలేదు. జగన్ వర్గానికి మొదటి నుండి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ సహా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జయసుధ, కాపు రామచంద్రా రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, టిడిపికి చెందిన బాలనాగిరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డిలు హాజరు కాలేదు.

సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ ఓ సినిమా షూటింగ్ కారణంగా చెన్నైలో ఉందని అందుకే హాజరు కాలేదని సమాచారం. కొండా సురేఖ సైతం భేటీకి హాజరయ్యే వారుకి తాను రావడం లేదని ఫోన్ ద్వారా సమాచారం అందించారట. కాపు రామచంద్ర రెడ్డి వ్యక్తిగత పనుల కారణంగా బెంగుళూరులో ఉన్నట్టు సమాచారం. గుర్నాథ్ రెడ్డి స్వల్ప అస్వస్థత కారణంగా హాజరు కాలేదు. ఇక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బాల నాగిరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి దాదాపు ఎప్పుడూ జగన్ భేటీలకు హాజరైన దాఖలాలు లేవు. కాబట్టి వారు హాజరు కాలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+