జగన్ ఆస్తులు ప్రకటిస్తారు: పిల్లి, భేటీలో 22 మంది

కాగా జగన్ భేటీలో 22 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన వారిలో నల్లిమిల్లి శేషారెడ్డి, బాబూరావు, పూతలపట్టు రవి, అమర్నాథ్ రెడ్డి, కుంజా సత్యవతి, చెన్నకేశవ రెడ్డి, కొర్ల భారతి, శ్రీనివాస్, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలరాజు, ప్రసాద్ రాజు, సుచరిత, శివప్రసాద్ రెడ్డి, శోభా నాగిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, రాజీనామా సమర్పించిన ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి హాజరయ్యారు.
భేటీకి ముందు శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సిగ్గుంటే మొదట పార్టీ రాజీనామాలు ఆమోదించాలన్నారు. పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గతంలో రాజీనామా చేయగానే ఆమోదించారని ఇప్పుడు తమ రాజీనామాలు ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. తమ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications