వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ స్నేహ సంకేతాలు, కాంగ్రెసు బేఖాతర్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కాంగ్రెసుతో దోస్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ ఇచ్చిన సంకేతాలను కాంగ్రెసు నాయకత్వం పట్టించుకోలేదు. పైగా చాలా తేలికగా కొట్టిపారేసింది. 2014 తర్వాత యుపిఎకైనా మద్దతిస్తామని జగన్ మంగళవారం చెప్పిన విషయం తెలిసిందే. జగన్ ప్రకటన గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా తానేమీ వ్యాఖ్యానించబోనని, తాము అడగలేదు.. ఖండించడం లేదని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. జగన్ వ్యాఖ్యల గురించి తాము వినలేదు కాబట్టి ప్రతిస్పందించే ప్రశ్నే ఉత్పన్నమే కాదని ఆయన అన్నారు. తాము గంట గంటకూ లోలకం మాదిరిగా ఆ మూల నుంచి ఈ మూలకు ఊగలేమని ఆయన అన్నారు.

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో వైయస్ జగన్ తీవ్ర భయాందోళనలకు గురయ్యారనే వార్తలు వస్తున్నాయి. దీంతోనే కాంగ్రెసుతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారనే విమర్శలు కూడా వస్తున్నాయి. జగన్ వ్యవహార శైలిని చూసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా బిత్తరపోయినట్లు చెబుతున్నారు. తాను బిజెపికి మద్దతిచ్చే ప్రశ్నే లేదని, అవసరమైతే 2014 ఎన్నికల తర్వాత యుపిఎకైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని జగన్ మంగళవారం ఓ జాతీయ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో అన్నారు.

English summary
Congress is not ready to take YSR Congress party president YS Jagan offer positively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X