కడప పౌరుషం ఢిల్లీలో తాకట్టు: వైయస్ జగన్‌పై రేవంత్

Revanth Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప పౌరుషాన్ని కాంగ్రెసులో తాకట్టు పెట్టారని తెలుగుదేశం పార్టీ యువ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి బుధవారం విమర్శించారు. జగన్ కాంగ్రెసును తెలుగులో తిట్టి ఇంగ్లీషులో పొగుడుతున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి ఓ గబ్బిలం అన్నారు. నాగం లాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ చూరు పట్టుకొని వేలాడుతున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు అవినీతి, అక్రమాలకు పుట్టిల్లు అన్నారు. జగన్ లక్ష్యం కేవలం అధికారమే అన్నారు. గనుల వ్యవహారం దివంగత వైయస్ అసమర్థత కాదా అని ప్రశ్నించారు.

ఐరన్ ఓర్‌ను అక్రమంగా తరలించిన గాలి జనార్ధన్ రెడ్డికి భారీ జరిమానా విధించాలని టిడిపి సీనియర్ నేతలు మండవ వెంకటేశ్వర రావు, కడియం శ్రీహరిలు డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకే గతంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో గనుల కేటాయింపు జరిగిందన్నారు. బ్రాహ్మిణి స్టీల్ అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గాలి అక్రమాలపై తెలుగుదేశం పార్టీ మొదటి నుండి పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గనుల అక్రమాలలో కాంగ్రెసు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిదే పూర్తి బాధ్యత అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+