బాలయ్యతో హరికృష్ణకు చెక్: బాబు వ్యూహం!

వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్న దృష్ట్యా ఆయన పార్టీ ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో తదుపరి ఎన్నికల్లో కాంగ్రెసు, టిడిపి మధ్యే పోటీ ఉంటుందని బాబు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెసులో ఉన్న చిరంజీవిని ఎదుర్కొనడానికీ బాబు బాలయ్యను తెరపైకి తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి గ్లామర్ ధీటుగా బాలయ్య గ్లామర్ కలిసి వస్తుందని బాబు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా కేవలం బాలయ్యను ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకోవడం వల్ల లాభం లేదని ఎన్నికల్లో పోటీ చేయిస్తే మరింత లాభం చేకూరుతుందనే ఉద్దేశ్యంతో బాబు ఉన్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాకుండా ఇటు తెలంగాణ ఉద్యమం, అటు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం దృష్ట్యా ఇప్పటికే రాష్ట్రంలో టిడిపి బాగా దెబ్బతిన్నది. దీంతో టిడిపి క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది. ఇరు ప్రాంతాలలోని టిడిపి క్యాడర్‌లో ఉత్సాహం నింపడానికి బాలయ్య ఎన్నికల పోటీని తెరపైకి తీసుకు వచ్చినట్లుగా కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. సినీ గ్లామర్ ఉన్న చిరంజీవిని ఎదుర్కొనడానికి, నందమూరి కుటుంబం అసమ్మతి నుండి తప్పించుకోవడానికి, టిడిపి క్యాడర్‌లో ఉత్సాహం నింపడానికి ఇలా పలు వ్యూహాలతోనే చంద్రబాబు బాలయ్యను ముందుకు తీసుకు వచ్చినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications