ఏం జరుగుతుందో నాకు తెలియాలి!: సోనియా గాంధీ

ఈ భేటీలో సోనియా తనయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక ఆమె శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఆమె వెళ్లిన లోటు పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెసు వారికి స్పష్టంగా కనిపించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే స్వయంగా చెప్పారు. సోనియా లేని లోటు కనిపిస్తోందని చెప్పారు. అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యమే కాకుండా సభలో ప్రతిపక్షాలను కూడా సమర్థవంతంగా అధికార పక్షం ఎదుర్కొన లేక పోయింది. దీంతో పార్టీ ప్రతిష్ట కాస్త మసకబారింది. దీన్ని పూడ్చే పనిలో సోనియా గాంధీ పడినట్లుగా కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ, వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమస్యపైనా ఆమె దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications