క్రిమినల్ కేసులు పెడితే సమ్మె ఆగిపోదు: స్వామి గౌడ్

తమ స్థానాల్లో పనులు చేయవద్దని సీమాంధ్ర ఉద్యోగులను ఆయన కోరారు. సమ్మె చేస్తున్న తమ స్థానాల్లో పని చేయవద్దని ఎపి ఎన్జీవోల సంఘం నేత గోపాల్ రెడ్డిని తాము కోరినట్లు ఆయన తెలిపారు. వారు వారి స్థానాల్లో పనిచేస్తూ, తమ స్థానాల్లో పనిచేయకపోతే ఎటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడదని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు సహకరిస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.
కాగా, సకల జనుల సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్, డిజిపి దినేష్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సచివాలయంలో 86 శాతం ఉద్యోగులు హాజరయ్యారు. హైదరాబాదు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 27 శాతం మంది హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాలో రెవెన్యూ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తప్ప మిగతా ఉద్యోగులంతా విధులకు గైర్హాజరయ్యారు. వరంగల్ జిల్లాలో ఉద్యోగులు దాదాపుగా అందరూ విధులను బహిష్కరించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సకల జనుల సమ్మె తీవ్ర ప్రభావం చూపింది.
సమ్మె కాలంలో తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోతే, తెలంగాణ వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మెదక్‌లో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెకు తమ మద్దతు ఉంటుందని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. సమ్మె కాలంలో తమ పార్టీవారిని ఇబ్బందులు పెడితే సహించబోమని ఆయన అన్నారు. సమ్మెపై తెలంగాణ జెఎసి తమను సంప్రదించకపోవడాన్ని ఆనయ తప్పు పట్టారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు కెసిఆర్‌కు తొత్తులుగా ఎందుకు పనిచేస్తున్నాయో తెలియడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications