యూజర్స్ కోసం విండోస్ 8 డెవలపర్స్ బిల్డ్ సమాచారం..

సాధారణంగా టెక్నాలజీ గురించి ఆసక్తి ఉన్నవారు విండోస్ 8లో ఏముందో తెలుసుకోవాలనుకునే కుంటే మైక్రోసాప్ట్ అఫీషియల్‌గా విడుదల చేసిన విండోస్ 8 డెవలపర్ బిల్డ్ ని డౌన్లోడ్ చేసుకొని దాని గురించిన పూర్తి సమాచారం తెలుసుకొవచ్చు. యూజర్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకటి మాత్రం తెలుసుకోవాలి ఇది స్టేబుల్ ఎడిషన్ కాదు దీనిలో యూజర్స్ ఇంటర్ఫేజ్ కి సంబంధించిన ఎన్ హాన్స్మెంట్స్ మరియు ఇతర విండోస్ ఫీచర్లు జతచెయ్యబడలేదు. కాకపోతే విండోస్ 8 ఎలా ఉంటుందనే అవగాహన వస్తుంది.
థర్డ్ పార్టీ అప్లికేషన్ డెవలపర్లు కంపాటిబిలిటీ సమస్యలు తలెత్తకుండా తమ అప్లికేషన్లను డెవలప్ మరియు టెస్ట్ చేసుకోవటానికి అవసరమయ్యే ఫీచర్లు ఈ విండోస్ 8 డెవలపర్ బిల్డ్ లో ఉన్నాయి. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్స్ ప్రివ్యూకి సంబంధించిన డౌన్లోడ్ కోసం ఈ లింక్ http://msdn.microsoft.com/en-us/windows/apps/br229516ని మీ బ్రౌజర్లో క్లిక్ చేసి పొందవచ్చు.












Click it and Unblock the Notifications