ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వైయస్ జగన్ లేఖ

కృష్ణా నదీ జలాల పంపకంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ట్రిబ్యునల్ తీర్పు రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉందని ఆయన అన్నారు. ఈ విషయం రైతులను కలవరపరుస్తోందని ఆయన అన్నారు. ట్రిబ్యునల్ తీర్పును సవరించాలని ఆయన ప్రధానిని కోరారు. కృష్ణా జలాల పంపకంలో ఎగువ రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడాల్సి వస్తోందని ఆయన అన్నారు. కృష్ణా జలాల పంపిణీకి అత్యున్నత కమిటీని వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు.
కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర సాగిస్తున్న జగన్ శనివారం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. మరణించిన తర్వాత కూడా వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ పోరాటం చేయలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు. అధికార కాంగ్రెసు పార్టీతో ప్రతిపక్షం కుమ్మక్కు కావడాన్ని రాష్ట్రంలోనే చూస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయి చేస్తున్న కుయుక్తులను దేవుడు చూస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెసు, టిడిపిలకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications