పట్టపగలు బహిరంగసభలో ఒరిస్సా ఎమ్మెల్యే హత్య

Orissa Map
భువనేశ్వర్: పట్టపగలు ఒరిస్సా శాసనసభ్యుడు శనివారం హత్యకు గురయ్యారు. పాలక బిజెడికి చెందిన శాసనసభ్యుడు జగబంధును ఓ బహిరంగ సభలో దుండగులు కాల్చి చంపారు. మావోయిస్టులు శాసనసభ్యుడిని హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. శాసనసభ్యుడి వ్యక్తిగత భద్రతాధికారి కూడా కాల్పుల్లో మరణించాడు. ఒరిస్సాలోని నవరంగ్‌పేట జిల్లా ఉమర్‌కోట నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది.

39 ఏళ్ల జగబంధు ప్రముఖ గిరిజన నాయకుడు. ఉమర్‌కోట నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భూమి పట్టాలు పంపిణీ చేయడానికి గోనా గ్రామానికి వెళ్లినప్పుడు జగబంధును కాల్చి చంపారు. పట్టాలు పంపిణీ చేస్తుండగా నలుగురు గుర్తు తెలియని సాయుధులు వేదిక వద్దకు కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో శాసనసభ్యుడు, సెక్యూరిటీ ఆఫీసర్ మరణించినట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ మన్మోహన్ ప్రహరాజ్ చెప్పారు. జగబంధు, భద్రతాధికారి పికె పాత్రో మృతదేహాలను రాయగడ్ పోలీసు స్టేషనుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+