తెలంగాణకు కాంగ్రెసు రెడీ, హైదరాబాద్ కిరికిరి: కెసిఆర్

Telangana Map
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం సుముఖంగా ఉందని, అయితే హైదరాబాదు విషయంలోనే కిరికిరి పెడుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు. మజ్లీస్ నేత అసదుద్దీన్ కాంగ్రెసు అధిష్టానం తన వద్దకు కాంగ్రెసు చూపిన కొత్త ప్రత్యామ్నాయాలతోనే వచ్చారని ఆయన చెప్పారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదనను కాంగ్రెసు ముందుకు తెచ్చిందని ఆయన అన్నారు. హైదరాబాదును వదిలే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రాయలసీమకు చెందిన అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపాలనే ప్రతిపాదన పెడుతోందని, దీనికి అసదుద్దీన్ కూడా సుముఖంగా ఉన్నారని ఆయన చెప్పారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణ కలిపితే తమకు అభ్యంతరం లేదని, దాని వల్ల పార్లమెంటు, శాసనసభ స్థానాలు కూడా రెండు రాష్ట్రాల్లో సమానంగా ఉంటాయని ఆయన అన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడానికి గతంలో రాయలసీమ ఇష్టపడలేదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల రాయలసీమకు నీటి సమస్య వస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపితే ఆ సమస్య తీరుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తమ హక్కులకు భంగం వాటిల్లుతుందని రాయలసీమవాళ్లు భయపడుతున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+