యుటిగా హైదరాబాద్, లేదంటే రాష్ట్రపతి పాలన?

Hyderabad
హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా సకల జనుల సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర విభజనకు కొత్త ఫార్ములాను తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడగొట్టి కొద్ది కాలం హైదరాబాదునే ఇరు ప్రాంతాలకు కేంద్రంగా ఉంచి రెండు రాష్ట్రాలు ఆయా రాజధానులను ఏర్పాటు చేసుకున్న అనంతరం హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి తెలంగాణ, సీమాంధ్రులు ఒప్పుకోని పక్షంలో ప్రస్తుతానికి రాష్ట్రపతి పాలన విధించే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోక పోయినా రెండు రాష్ట్రాలు - రెండు రాజధానులు అనే సూత్రంతో కేంద్రం ముందుకు వెళ్లాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదే అత్యుత్తమ పరిష్కారమని ఇంతకన్నా ఉత్తమ పరిష్కారం లేదనే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా సమాచారం. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలు రెండుగా ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాలు రెండు రాజధానులు ఏర్పాటు చేసుకునే వరకు హైదరాబాదును కేంద్రంగా ఉంచి అక్కడి నుండి వచ్చే ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు పంచాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా హైదరాబాదు అవసరాలు తీరిన తర్వాతనే సీమాంధ్ర, తెలంగాణలకు పంచాలనేది కేంద్రం నిర్ణయంగా కనిపిస్తోంది. రెండు నెలలుగా ఇరు ప్రాంతాల నేతలతో భేటీ అవుతున్న అధిష్టానం ఇకముందు ఈ దిశలో వారిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరగవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటు సీమాంధ్రులు, అటు తెలంగాణవారు హైదరాబాదు పైనే దృష్టి పెడుతున్నారు. హైదరాబాదు లేకుంటే విభజనకు అడ్డంకే ఉండేది కాదు. దీంతో ఈ హైదరాబాదు పైనే కేంద్రం గత కొంతకాలంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆఖరకు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు తమ తలతెగినా హైదరాబాదును వదులుకోమని తెలంగాణవాదులు, తాము అంతేనని సీమాంధ్ర వాదులు ఇప్పటి వరకు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో ఇరు ప్రాంతాల మధ్య పూర్తి విభేదాలు పొడసూపిన నేపథ్యంలో ఇంతకు మించి మార్గం లేదని, ఇదే మధ్యేమార్గమనే భావనతో కేంద్రం ఉన్నట్లుగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+