పరిటాల హత్య: చంద్రబాబుకు శైలజానాథ్ కౌంటర్

Sailajanth
అనంతపురం: జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు మంత్రి శైలజానాథ్ శుక్రవారం కౌంటర్ వేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాలో జరిగిన నరమేధాలు చంద్రబాబు నాయుడు గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. అప్పట్లో ఆర్వోసి ముసుగులో కాంగ్రెసు కార్యకర్తల హత్యలు జరిగాయని ఆరోపించారు. నాడు నరమేధాలు జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి హత్య కేసులోకి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని లాగడం సరికాదన్నారు.

కాగా గురువారం చంద్రబాబు తన అనంత పర్యటనలో పరిటాలను హత్య చేయించింది వైయస్సే అని తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారమూ అనంతలో పర్యటించిన బాబు కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో టిడిపి కార్యకర్తలను హతమార్చుతున్నారన్నారని మరోసారి ఆరోపించారు. టిడిపి కార్యకర్తల హత్యలు కాంగ్రెసు రాక్షస ప్రవృత్తికి నిదర్శనమన్నారు. పోలీసులు సరిగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ధర్మవరంలోని హత్యలపై పార్టీ తరఫున హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని చెప్పారు. జిల్లాలో హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేను, ఆయన అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల హత్యకు గురైన టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+