నేను చెప్పింది రహస్యం, వెల్లడించను: కిరణ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేవని, రాష్ట్రపతి పాలన విధించడానికి కొన్ని నియమాలున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితుల గురించి అభిప్రాయ సేకరణ జరుపుతున్నారని, అందులో భాగంగానే తాను ఢిల్లీ వచ్చానని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సకల జనుల సమ్మె గురించి తాను హైదరాబాదులో మాట్లాడుతానని ఆయన అన్నారు. సమ్మె విరమించాలని తాను ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశానని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణకు సామరస్యపూర్వక పరిష్కారం కోసం కసరత్తు జరుగుతోందని, తెలంగాణ నిర్ణయంపై మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు కేంద్ర నాయకులు మాట్లాడుతారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరితో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య చాలా కాలంగా ఉందని, దానికి పరిష్కారం కనుక్కోవాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications