తెలంగాణ వ్యాఖ్యపై వెనక్కి తగ్గిన ప్రణబ్ ముఖర్జీ

pranab mukherjee
న్యూఢిల్లీ: తెలంగాణపై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యల నుంచి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెనక్కి తగ్గారు. తాను అలా అనలేదని ఆయన శుక్రవారం రాత్రి వివరణ ఇచ్చారు. తెలంగాణపై కాంగ్రెసు మినీ కోర్ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే ఇతర సమస్యలు వస్తాయని, ఇతర ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తాయని తాను అనలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై ముడిపడి ఉన్న అంశాలపై చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సంప్రదింపులు కొనసాగుతాయని ఆయన అన్నారు.

కాగా, తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం చర్చల ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన శనివారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పార్టీ అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించింది. పార్టీ తరఫున పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహ చర్చల్లో పాల్గొంటారు.

తెలంగాణపై నాలుగైదు రోజుల్లో సానుకూల ప్రకటన వస్తుందని తెలంగాణ కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్లనే రైల్ రోకోను తెలంగాణ జెఎసి వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద, తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం వేగంగా ముందుకు కదులుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+