ముఖ్యమంత్రి కిరణ్ మార్పు అవాస్తవం: బొత్స

Kodandaram
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మారుస్తారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం న్యూఢిల్లీలో అన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాదుతో భేటీ అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదన్నారు. గాంధీ భవనంలో ఉదయం జరిగిన యువజన విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జరిగిన రసాభాసపై సమాచారం తెలుసుకుంటున్నానని పూర్తిగా తెలుసుకున్న తర్వాత స్పందిస్తానన్నారు.

సకల జనుల సమ్మె ప్రభావం లేదని ఎవరూ అనడం లేదని తప్పకుండా సమ్మె ప్రభావం ఉంటుందన్నారు. సమ్మె ప్రభావం లేదని ఎవరైనా అంటే అది తప్పే అవుతుందన్నారు. కేంద్రం తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఈ సమయంలో అందరూ కేంద్రానికి సహకరించాలని కోరారు. సమ్మె వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం లోగా సమ్మె ఆగిపోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కాగా సాయంత్రం బొత్స హైదరాబాదు తిరిగి రానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+