India A vs Afghanistan A: ఆప్ఘనిస్తాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమి..!
శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు టోర్నీ రెండో మ్యాచ్ లో ఇవాళ పసికూన ఆప్ఘనిస్తాన్ (Afghanistan A) చేతిలో భారత ఏ (India A) జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. దంబుల్లాలో జరిగిన రెండో మ్యాచ్ లో ఆప్ఘనిస్తాన్ పై భారీ స్కోరు సాధించి గెలుపుపై ధీమాగా ఉన్న టీమిండియా అనూహ్య పరిణామాల మధ్య డీఎల్ఎస్ విధానంలో ఓడిపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించేందుకు భారత్ పడిన శ్రమ అంతా వృథా అయింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏ జట్టుకు ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ప్రభ్ సిమ్రన్ 69 బంతుల్లో 14 ఫోర్లతో 84 పరుగులు, వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి భారత్ ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశారు. అనంతరం వచ్చిన ప్రియాన్ష్ ఆర్య విఫలమైనా.. రుతురాత్ గైక్వాడ్, కెప్టెన్ తిలక్ వర్మ తలో 66 పరుగులు చేశారు. చివర్లో సూర్యాన్ష్ షెడ్జే కూడా 40 పరుగులతో మెరిశాడు. దీంతో భారత్ 49 ఓవర్లలో 9 వికెట్లకు 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆప్ఘన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్ జాయ్ 68 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

Afghanistan A won by 4 runs (DLS Method).
— BCCI (@BCCI) June 11, 2026
India A will now shift focus towards their next fixture in the #TriNationSeries.
Scorecard ▶️ https://t.co/dMNsGrzIOD#INDAvAFGA pic.twitter.com/XDa1P3tNMg
అనంతరం 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్ కూడా మెరుపు ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్లు కెప్టన్ ఇమ్రాన్ మీర్ .. మరో ఓపెనర్ హస్సన్ ఐసాఖిల్ తో కలిసి తొలి వికెట్ కు 63 పరుగులు జోడించారు. అనంతరం హస్సన్ అవుటైనా ఇమ్రాన్ మీర్ దూకుడు కొనసాగింది. ఈ క్రమంలో ఇమ్రాన్ అర్ధసెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. వన్ డౌన్ లో వచ్చిన ఖాలిద్ తనివాల్ కూడా 2 పరుగులకే అవుటైనా బాహిర్ షా సాయంతో ఇమ్రాన్ దూకుడు కొనసాగించాడు. ఆ తర్వాత బాహిర్ షా కూడా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆప్ఘన్ 2 వికెట్లు 177 పరుగులు చేసిన తరుణంలో భారీ వర్షం కురిసింది. అది ఎంతకూ తగ్గకపోవడంతో డీఎల్ఎస్ పద్దతి ప్రకారం అంపైర్లు ఆప్ఘనిస్తాన్ 4 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు. 75 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ఆప్గన్ కెప్టెన్ ఇమ్రాన్ మీర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు.














Click it and Unblock the Notifications