NRI News: శ్రీలంకలో జగిత్యాల జిల్లా వాసి అరెస్ట్..
జగిత్యాల జిల్లాకు చెందిన ఓ ప్రవాసీయుడిని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అతను విమానంలో అసభ్యంగా ప్రవర్తించడానే అభియోగంతో అదుపులోకి తీసుకున్నారు. సౌదీ అరేబియా రియాద్ నుంచి శ్రీలంక మీదుగా హైదరాబాద్ ఓ విమానం వస్తోంది. విమానంలో భారతీయ వ్యక్తి మహిళతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో శ్రీలంక పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే తాను మానవీయ కోణంతో సాయం చేశానని చెప్పారు. విమానంలో ఏ రకమైన అసభ్యకర ప్రవర్తనకు పాల్పడలేదన్నారు.
విమానంలో చలిని తట్టుకోలేకపోతున్న తన కూతురు కంటే కూడా చాలా చిన్నదైన పాపను అమె తల్లి కోరిక మేరకు పైన క్యాబిన్ నుంచి దుప్పటి తీసి కప్పానని వివరించారు. అరెస్ట్ అయిన వ్యక్తి జగిత్యాల జిల్లా జగిత్యాల మండలానికి చెందిన వారిగా గుర్తించారు. అతను విమానం మొదటి వరుసలో కూర్చుని ప్రయాణిస్తున్నారు. అదే విమానంలో ఓ మహిళ తన చిన్న పాపతో కలిసి ప్రయాణిస్తుంది. పాప చలికి వణుకుతుంది. దీంతో ఆమె సదరు వ్యక్తిని దుప్పటి ఇవ్వాలని కోరింది.

దీంతో అతను క్యాబిన్ నుంచి ఎయిర్‌లైన్సు ఇచ్చే దుప్పటిని తీసిచ్చానని చెప్పాడు. తల్లి కోరడంతోనే బాలికపై కప్పానని ఆ ప్రవాసీ తన కుటుంబానికి ఫోన్ చేసి పేర్కొన్నాడు. తనకు ఉన్న ఇద్దరు కుమార్తెల కంటే కూడా తక్కువ వయస్సు ఉన్న బాలిక పట్ల గానీ అమె తల్లి పట్ల గానీ తనకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పాడు. శ్రీలంకలో పోలీసులు నిర్వహించిన వైద్య పరీక్షలలో కూడా తన గురించి ఎలాంటి తప్పుడు నివేదికలు రాలేదని పేర్కొన్నాడు.
ప్రవాసీ కుటుంబానికి సౌదీ అరేబియాలోని సామాజిక కార్యకర్త అబ్దుల్ రఫీక్ అండగా నిలిచాడు. నిష్పాక్షిక విచారణ జరపాలని శ్రీలంకలోని భారతీయ హై కమీషన్ కు విజ్ఞప్తి చేశాడు. ప్రముఖ ప్రవాసీయుడు పోలాస అక్బర్ సహాయంతో శ్రీలంకలో న్యాయవాదులను కూడా సంప్రదిస్తున్నట్లుగా రఫీక్ తెలిపారు. దీనిపై భారత విదేశంగా శాఖ కూడా స్పందంచాలని బాధితులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications