కేటీఆర్ కోర్టుకు హాజరైన వేళ కీలక పరిణామాలు..!!

ఫార్ములా-ఈ రేసు అక్రమాల కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తొలిసారిగా విచారణకు కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కీలక అంశాలను వెల్లడించింది. కాగా.. విచారణ వేళ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. పోరాటాలను అక్రమ కేసులు ఆపలేవని పేర్కొన్నారు.

ఫార్ములా-ఈ రేసు వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన కేటీఆర్, తనపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఉదయం కోకాపేటలోని తన నివాసం నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు చేరుకున్న ఆయన, తనకు ఎదురైన ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండించారు. ప్రజల తరఫున మేం చేసే పోరాటాలను ఇటువంటి తప్పుడు కేసులు ఎంతమాత్రం ఆపలేవు.. అంతిమంగా సత్యమే గెలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఈ కేసు వ్యవహారంలో కేటీఆర్ ఎలాంటి తప్పు జరగలేదని.. తాను అవినీతి చేయలేదని చెబుతూ వచ్చారు. కాగా, తాజాగా దాఖలైన ఛార్జ్ షీట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు.

ktr-attends-nampally-acb-court-in-formula-e-car-race-case-hearing-adjourned-to-25-august

కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఈ కేసులో కార్‌ రేస్‌తో HMDAకు రూ.54.88 కోట్ల నష్టం జరిగిందని చార్జ్‌షీట్‌‌లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, FEO కంపెనీని నిందితులుగా ఏసీబీ అధికారులు ఈ కేసులో చేర్చారు. ఛార్జ్‌షీట్ ధాఖలు చేసిన తర్వాత మొదటి కేసును న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇందుల ప్రస్తావించి న అంశాలతో కేటీఆర్ న్యాయవాదులు విభేదించారు. కాగా.. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకున్నామని కోర్టు తెలిపింది. తదుపరి ఈ కేసులో ట్రయల్ మొదలు పెట్టనుంది. తదుపరి విచారణను ఆగస్టు25వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కేటీఆర్ లక్ష పూచీకత్తు , 2 షూరిటీస్ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q