ఆ మోడ్రన్ డ్రెస్‌లు ఏందయ్యా?: 'రామాయణ' ట్రైలర్‌లో ఆమెను చూపించిన తీరుపై దుమారం!

నితీష్ తివారీ దర్శకత్వం వహించిన 'రామాయణ' ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి విమర్శలను ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ నుంచి నటీనటుల ఎంపిక, నటన, వీఎఫ్ఎక్స్ వరకు అన్నింటిపైనా విమర్శలు వెల్లువెత్తాయి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవిల మధ్య పొంతన కుదరలేదని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రావణుడిగా యష్ స్వరం గురించి కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఆ సినిమాలో అవకాశం అదృష్టంగా భావిస్తున్నా: సిమ్రాన్ చేతిలో బిగ్ ప్రాజెక్ట్!
ఆ సినిమాలో అవకాశం అదృష్టంగా భావిస్తున్నా: సిమ్రాన్ చేతిలో బిగ్ ప్రాజెక్ట్!

మరోవైపు సాయి పల్లవి, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన దుస్తులు, ఆభరణాలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 'రామాయణ' ట్రైలర్‌లో లారా దత్తా హెయిర్ స్టైల్, డిజైనర్ బ్లౌజుతో ఉన్న పట్టుచీరను ధరించి కనపించారు. ఈ క్రమంలో త్రేతాయుగంలో ఇలాంటి వస్త్రధారణ ఉండేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే విధంగా సాయి పల్లవి రకుల్ ప్రీత్ సింగ్‌ల అలంకరణ కూడా విమర్శల పాలవుతోంది. త్రేతాయుగంలో ఇంత పరిపూర్ణమైన అలంకరణ, కేశాలంకరణ ఎక్కడి నుంచి వచ్చాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో రామానంద్ సాగర్ నుంచి రామాయణం నేర్చుకుని ఉండాల్సిందని కామెంట్లు చేస్తున్నారు.

Modern Costumes in Ramayana Trailer Trigger Backlash Online and Makeup for Lara Dutta Details Inside

ఈ సినిమాలో దశరథ మహారాజు భార్య అయిన కైకేయి రాణిగా లారా దత్తా, సీతగా సాయి పల్లవి, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్ర బృందం వస్త్రధారణ, ఆభరణాలను రింపిల్, హర్‌ప్రీత్ రూపొందించారు. వీరు గతంలో పద్మావత్", "హీరామండి" వంటి ప్రాజెక్టులకు కూడా దుస్తులను డిజైన్ చేశారు.

బోల్డ్ సీన్స్‌తో రచ్చ రచ్చ... 'టాక్సిక్’ పై కియారా మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!
బోల్డ్ సీన్స్‌తో రచ్చ రచ్చ... 'టాక్సిక్’ పై కియారా మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ట్రైలర్‌లో లారా దత్తా ఆకుపచ్చ బ్లౌజ్, బంగారు అంచు ఉన్న మెరూన్ రంగు చీరతో కూడిన టూ-టోన్ చీరను ధరించి కనిపించింది. ఆమె జుట్టును చక్కగా స్ట్రెయిట్ చేసి, ఒక వైపుకు దువ్వి ఉంది. ఆమె ఎర్రటి బిందీ పెట్టుకుంది.కొందరు కైకేయి పాత్ర సరళమైన శైలిని ప్రశంసించగా.. మరికొందరు త్రేతా యుగం నేపథ్యంలో సాగే కథకు లారా దుస్తులు, రూపం, కేశాలంకరణ కూడా మరీ ఆధునికంగా ఉన్నాయని ప్రశ్నించారు. ఆ దుస్తులు ఏక్తా కపూర్ టీవీ సీరియల్ నుంచి తీసుకున్నట్లుగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఇది చీరల ప్రకటనలా కనిపిస్తోందని ఓ నెటిజన్ పేర్కొనగా.. "ఆమెను వెంటనే సెట్‌కు పిలిచినట్లుంది. అందుకే ఆమెకు దొరికినవన్నీ తెచ్చుకుంది." అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.

త్రేతా యుగంలో మహిళలు బ్లష్ వాడేవారా?
అదేవిధంగా, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిల గురించి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాయి పల్లవి 'సీత' లుక్‌లో బ్లష్ వాడటంతో, "త్రేతా యుగంలో బ్లష్ అసలు ఎలా ఉండేది?", "ఆ మేకప్ అంత పర్ఫెక్ట్‌గా ఎలా వచ్చింది?" అని చాలా మంది అడుగుతున్నారు. ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేయాలనుకున్న ఈ చిత్ర బృందానికి ఈ నెగిటివిటీతో సినిమా విడుదల అనంతరం కలెక్షన్లపై ప్రభావం పడునున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+