అదిరిపోయే లుక్ లో రోహిత్ శర్మ - ఫ్యాన్స్ ఫిదా, ఇక నో డౌట్..!!

క్రికెట్ సంచలనం రోహిత్ శర్మ కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. ఇంగ్లాండ్ సిరీస్ తో తొలుత హిట్ మ్యాన్ విఫలం కావటంతో ఇచ లార్డ్స్ లో జరిగిన మ్యాచ్ చివరిదిగా ప్రచారం చేసారు. ఆ మ్యాచ్ లో తాను ఏంటో బ్యాట్ తోనే రోహిత్ సమాధానం ఇచ్చారు. కాగా.. వచ్చే 2027 ప్రపంచ కప్ లో రోహిత్ ఆడటం పైనా చర్చలు సాగుతున్నాయి. ఈ సమయంలో రోహిత్ ఒకే ఒక్క ఫొటో తో తాను ప్రపంచ కప్ కు ఎంత సిద్దంగా ఉన్నానో తేల్చి చెప్పారు.

క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్- అన్ని ఫార్మాట్లకు టీం ఇండియా క్లాస్ ప్లేయర్ గుడ్ బై..!!
క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్- అన్ని ఫార్మాట్లకు టీం ఇండియా క్లాస్ ప్లేయర్ గుడ్ బై..!!

హిట్ మ్యాచ్ ఇప్పుడు అసలు టార్గెట్ 2027 ప్రపంచ కప్. ఇందు కోసం వేచి చూస్తున్నారు. ఇక, తన ఫిట్ నెస్ పైన ఉన్న అనుమానాలకు పూర్తి సమాధానం ఇస్తున్నారు. తన లుక్స్ లోనూ మార్పు చేసారు. గడ్డం తీసేసి క్లీన్​ షేవ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్​ గా మారింది. గతంలో బొద్దుగా ఉన్న రోహిత్‌ ఇప్పుడు ఫిట్‌గా న్యూ లుక్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు. క్రమమైన వ్యాయామం, కంట్రోల్డ్‌ డైట్స్‌ వల్ల సుమారు 10 కిలోల బరువు తగ్గి మరింత సన్నగా, చురుకుగా మారారు. ఈ ఫొటో చూసిన రోహిత్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రోహిత్ ప్రపంచ కప్ కోసం సిద్దంగా ఉన్నాడంటూ పోస్టులు చేస్తున్నారు.

క్రికెట్ ప్రపంచంలో విషాదం: చోటుదక్కలేదని క్రికెటర్ ఆత్మహత్య
క్రికెట్ ప్రపంచంలో విషాదం: చోటుదక్కలేదని క్రికెటర్ ఆత్మహత్య
Rohit Sharma s new look has sent the internet into meltdown spotted with Ravi Shastri in London

రవిశాస్త్రి తాను రోహిత్ తో దిగిన ఫొటో షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ రాసారు. 'లండన్‌లో క్యాజువల్​గా నడుస్తుంటే రోహిత్ శర్మ కలిశాడు. అనుకోకుండా అతడిని కలవడం చాలా బాగుంది' అని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. ఈ ఫొటోటో ఇందులో గడ్డం తీసేసిన రోహిత్ నవ్వుతూ కనిపిస్తున్నాడు. రవిశాస్త్రి చేసిన పోస్టింగ్ పైన ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. ''రోహిత్‌ మరింత యంగ్‌గా కనిపిస్తున్నాడు'', ''మోటివేషన్‌ కావాలంటే రోహిత్‌ని చూడాలి'' వంటి కామెంట్లు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో వెల్లువెత్తుతున్నాయి. అతడి లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫొటోలో రోహిత్ శర్మ వయసు 10ఏళ్లు తక్కువగా కనిపిస్తుందని పోస్టులు పెడుతున్నారు. దీంతో.. ఇప్పుడు రోహిత్ శర్మ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+